జామకాయలు తినడం వల్ల ఈ సమస్యలు రావట..!

0
41

మన చుట్టూ పరిసరాలలో దొరికేటటువంటి కాయలలో జామకాయ కూడా ఒకటి. దీనికి తినడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు  జామకాయలు కొనివ్వమని మారం చేస్తుంటారు. జామకాయలు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరు కూడా ఓలుక్కేయండి..

డయాబెటిస్  పేషెంట్ లకి  షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడంలో జామకాయ సహాయపడుతుంది. ఎందుకంటే జామ పండు త్వరగా జీర్ణం కాదు. అంతేకాకుండా జామకాయలలో ఉండే గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల రక్తం లోపలికి వెళ్లి చక్కెర స్థాయిని పెంచకుండా చూస్తాయి. అంతేకాకుండా త్వరగా బరువు తగ్గాలనుకునే వారు కూడా జామకాయలు తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

జామకాయను పచ్చిగా ఉన్నప్పుడు తినే దానికంటే, పండుగ మారినప్పుడు తినడం మంచిది. ఎందుకంటే అది పండుగా మారేకొద్దీ విటమిన్స్, క్యాల్షియం, మినరల్స్ ఎక్కువగా పెరిగి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. తలనొప్పి, మైగ్రేషన్ తో బాధపడేవారు జామకాయని ముద్ద లాగ నూరి ప్రతిరోజు 2 సార్లు తలకి పట్టించుకుంటే తగ్గిపోతుంది.