తెలంగాణ కరోనా బులిటెన్ : ఆ రెండు జిల్లాల్లో సున్నా కేసులు, 6 జిల్లాల్లో సింగిల్ డిజిట్

Today Telangana Corona cases Bulletin Released

0
42

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింతగా తగ్గుముఖం పట్టింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని కార్యకలాపాలను నేటినుంచే అనుమతించింది. కోవిడ్ నిబంధనలన్నింటినీ తొలగించింది. అన్ లాక్ ప్రక్రియ చేపట్టింది. ఆదివారం వెల్లడైన కరోనా బులిటెన్ లో రెండు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్ లలో సున్నా కేసులు నమోదు కాగా కేవలం ఒక జిల్లాలో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు ఆరు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.

ఆదివారం నమోదైన కేసులు 1006 మాత్రమే. శనివారం నమోదైన 1362 కేసులతో పోలిస్తే మూడు వందలకు పైగా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. ఆదివారం మరణాల సంఖ్య 11 నమోదైంది. శనివారం 12 మరణాలతో పోలిస్తే ఒకటి తగ్గింది. జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 141 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సైతం పరిస్థితి ఆశాజనకంగా మారి డబుల్ డిజిట్ కు కేసులు చేరుకున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 87,854 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1798గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 17765 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1319.
ఆదివారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 0 కేసులు
కొత్తగూడెం 50
జిహెచ్ఎంసి 141
జగిత్యాల 17
జనగామ 12
జయశంకర్ భూపాలపల్లి 11
జోగులాంబ గద్వాల 10
కామారెడ్డి 4
కరీంనగర్ 62
ఖమ్మం 88
కొమరం భీం ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 21
మహబూబాబాద్ 28
మంచిర్యాల 26
మెదక్ 9
మేడ్చల్ మల్కాజ్ గిరి 58
ములుగు 8
నాగర్ కర్నూల్ 13
నల్లగొండ 64
నారాయణపేట 5
నిర్మల్ 0
నిజామాబాద్ 9
పెద్లపల్లి 27
రాజన్న సిరిసిల్ల 21
రంగారెడ్డి 79
సంగారెడ్డి 18
సిద్దిపేట 34
సూర్యాపేట 68
వికారాబాద్ 16
వనపర్తి 29
వరంగల్ రూరల్ 17
వరంగల్ అర్బన్ 41
యాదాద్రి భువనగిరి 17