తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు : నేటి లిస్ట్ ఇదే

Today Telangana Covid cases Report

0
40

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే శుక్రవారం స్వల్పంగా తగ్గింది. నేడు వెల్లడైన బులిటెన్ లో వివరాలు ఇవీ. తెలంగాణలో శుక్రవారం కోవిడ్ పాజిటీవ్ కేసులు 1417 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 12 సంభవించాయి.
నిన్న గురువారం 1492 కేసులతో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిగా తగ్గడం ఊరట కలిగిస్తున్నది. మరణాల సంఖ్య కూడా గురువారంతో పోలిస్తే ఒకటి తగ్గింది. నిన్న 13 మంది మరణించారు.
జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ఇవాళ త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేసుల సంఖ్య డబుల్ డిజిట్ కే పరిమితమయ్యాయి.
ఇక ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో కేసులు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాయి. మిగతా జిల్లాలన్నీ డబుల్ డిజిట్ తో ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పరీక్షలు 1,24,430 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1897గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 19029 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 994.
శుక్రవారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 6 కేసులు
కొత్తగూడెం 82
జిహెచ్ఎంసి 149
జగిత్యాల 36
జనగామ 13
జయశంకర్ భూపాలపల్లి 32
జోగులాంబ గద్వాల 10
కామారెడ్డి 7
కరీంనగర్ 87
ఖమ్మం 93
కొమరం భీం ఆసిఫాబాద్ 6
మహబూబ్ నగర్ 25
మహబూబాబాద్ 60
మంచిర్యాల 46
మెదక్ 16
మేడ్చల్ మల్కాజ్ గిరి 61
ములుగు 26
నాగర్ కర్నూల్ 17
నల్లగొండ 88
నారాయణపేట 8
నిర్మల్ 2
నిజామాబాద్ 10
పెద్లపల్లి 65
రాజన్న సిరిసిల్ల 26
రంగారెడ్డి 104
సంగారెడ్డి 22
సిద్దిపేట 43
సూర్యాపేట 85
వికారాబాద్ 23
వనపర్తి 37
వరంగల్ రూరల్ 24
వరంగల్ అర్బన్ 62
యాదాద్రి భువనగిరి 46