కరోనా నుండి కాపాడుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ మాస్కులు వాడాల్సిందే!

0
101

కరోనా వైరస్ మన అందరిని ఎంతో భయపెడుతోంది.ఓమీక్రాన్ వేరియంట్ వల్ల చాలా మంది సతమతమవుతున్నారు. కావున ఈ సమయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఒకరి నుండి మరొకరికి వైరస్ సోకుతుంది.కాబట్టి మనం అందరం  మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

మాస్క్ ధరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ ఒమీక్రాన్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి మాస్కు ధరించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే N99 మాస్కులని ధరిస్తే మంచిది. ఇది మంచిగా రక్షణను ఇస్తుంది. దీన్ని ఉపయోగిస్తే మంచిగా ప్రొటెక్షన్ ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. N95,KN95 మాస్కులని గ్లోబల్ స్టాండర్డ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. మంచి నాణ్యతతో ఇవి ఉంటాయి. అలాగే చక్కగా ఫిట్ అవుతాయి. 95 శాతం ప్రొటెక్షన్ మనకి లభిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సర్జికల్ మాస్క్లని ఉపయోగించినప్పుడు డబల్ మాస్క్ వేసుకోండి. N95 మాస్క్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే అప్పుడు సర్జికల్ మాస్కులని ఉపయోగించడం మంచిదని డాక్టర్లు అంటున్నారు.

చాలా మంది వరకు క్లాత్ మాస్కులని వాడుతున్నారు. అయితే క్లాత్ మాస్క్ నుండి మంచిగా ప్రొటెక్షన్ లభించాలంటే ఖచ్చితంగా సర్జికల్ మాస్క్ వేసుకోండి. ఈ రెండిటినీ కలిపి వేసుకుంటేనే రక్షణ లభిస్తుంది లేదంటే అనవసరం. అలానే మాస్క్ వేసుకునేటప్పుడు పూర్తిగా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ముక్కు భాగం, నోటి భాగం మొత్తం క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలానే N95
మాస్కుల ని ఉతికి మళ్లీ వాడకూడదు. ఇలా మాస్కులు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.