బిర్యానీ ఆకు తినడం కలిగే అద్భుత ప్రయోజనాలివే?

0
87

మనకు ఏ కూరలోనైనా రుచి, సువాసన బాగుండాలంటే బిర్యానీ ఆకులు వేస్తుంటాము. ముఖ్యంగా చికెన్, మటన్ లాంటి వంటకాలలో బిర్యానీ ఆకుని తప్పకుండా వాడుతుంటారు. కేవలం కూరలల్లో వేసుకోవడమే కాకుండా ఈ విధంగా తిన్న కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో మీరు కూడా చూడండి..

బిర్యానీ ఆకుల్లో సహజంగా ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పి, శ్వాస సమస్యలను దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు బిర్యానీ ఆకులు తీసుకొవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. బిర్యానీ ఆకుల టీ ప్రతి రోజూ తాగడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

దీనివల్ల సీసనల్ వ్యాధులు రాకుండా మనకు రక్షణ కల్పిస్తుంది. బిర్యానీ ఆకులో ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండడం వల్ల గర్భిణులు కూరలలో బిర్యానీ ఆకు అధికంగా వేసుకొని తినడం కడుపులో బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా అతి బరువు, ఊబకాయం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.