ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభించినప్పుడే ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తాము. ముఖ్యంగా మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఐరన్ కూడా ఒక్కటన్న విషయం అందరికి తెలిసిందే. ఒకవేళ శరీరంలో ఐరన్ శాతం తగ్గితే ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయో మీరు కూడా ఓ లుక్కేయండి..
ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను తింటేనే మనకు రక్తం ఎక్కువగా పెరుగుతుంది. అందుకే ముఖ్యంగా మహిళలు ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారపదార్దాలను తీసుకోవడం మంచిది. శరీరంలో ఐరన్ ఏమాత్రం తగ్గినా అనారోగ్యానికి గురికాక తప్పదంటున్నారు నిపుణులు. ఐరన్ లోపించడం రక్తహీనత సమస్య వేధించే అవకాశం అధికంగా ఉంటుంది.
ఒకవేళ శరీరంలో ఐరన్ తగ్గితే తీవ్ర అలసట, చికాకు, బలహీనంగా మారడం, ఏకాగ్రత కుదరకపోవడం, చర్మం తెల్లగా పాలిపోయినట్లు కనిపించడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలనొప్పి, అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం ఇలా అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఆకుకూరలు తీసుకోవడంతో పాటు వైద్యుడిని సంప్రదించడం మంచిది.