విరేచ‌నాలకు విరుగుడు పెట్టే సహజసిద్ధమైన చిట్కాలివే?

0
108

మనలో చాలామంది అప్పుడ‌ప్పుడూ విరేచ‌నాలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. విరేచ‌నాల బారిన ప‌డ‌డానికి చాలా కార‌ణాలు ఉండగా..ముఖ్యంగా మ‌నం తీసుకునే ఆహారం, తాగే నీరు కార‌ణంగా విరేచ‌నాలు క‌లుగుతాయి. ఇంకా డ‌యాబెటిస్, థైరాయిడ్ కార‌ణంగా కూడా విరేచనాలు అవుతుంటాయి. అయితే విరేచ‌నాలకు తగ్గించుకోవడానికి వివిధ రకాల మందుల‌ను, యాంటీ బ‌యాటిక్స్ వాడుతుంటారు. కానీ అవి వాడడం వల్ల అనేక రకాల దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మన ఇంటి చిట్కాలతో విరేచ‌నాలకు విరుగుడు పెట్టండిలా.

విరేచ‌నాల బారిన ప‌డ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే నీరు అంతా పోయి నీర‌సంగా తయారయ్యి యాక్టీవ్ గా ఉండలేకపోతాము. అంతేకాకుండా అప్పుడప్పుడు  నీర‌సంతో స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కావున ఈ సమస్య తొలగించడంలో దానిమ్మ గింజ‌లు అద్భుతంగా ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్క‌ల‌ను నీటిలో వేసి మ‌రిగించి క‌షాయంలా తయారుచేసి అందులో ప‌టిక బెల్లాన్ని క‌లిపి తాగడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

ఇంకా సోంపు గింజ‌ల పొడిని, ప‌టిక బెల్లం పొడిని, క‌రక్కాయ పొడిని, శొంఠి పొడిని స‌మ‌పాళ్ల‌లో తీసుకుని నీటిలో క‌లిపి తాగ‌డం వ‌ల్ల కూడా ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు. కానీ ఈ చిట్కాల‌ను పాటించేట‌ప్పుడు సులువుగా జీర్ణ‌మ‌య్యే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.