కోవిడ్ టీకా అలా తీసుకుంటే చాలా డేంజర్

0
88

కరోనా విషయంలో అనేక కంపెనీలు టీకాలను ముందుకు తెచ్చాయి. అయితే కొందరు తొలి డోస్ లో ఒక కంపెనీ టీకా, రెండో డోసులో ఇంకో కంపెనీ టీకా వేయించుకున్నట్లు సమాచారం అందుతున్నది. ఇలా మిశ్రమ డోసుల టీకాలు వేయించుకోవడం చాలా డేంజర్ అంటున్నారు డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్.

వేర్వేరు కంపెనీలు రూపొందించిన కోవిడ్ టీకాలను మొదటి, రెండో డోసులుగా వినియోగించడం చాలా ప్రమాదకరం అని డాక్టర్ స్వామినాథన్ హెచ్చరించారు. కానీ ఈ ప్రక్రియ ద్వారా టీకాలు వేసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో ఇంకా సమగ్రమైన డేటా అందుబాటులో లేదని ఆమె వెల్లడించారు.

soumya swaminathan
soumya swaminathan

మిశ్రమ డోసుల వినియోగం ప్రభావం విషయంలో అధ్యయనం కొనసాగుతుందని వివరించారు. కోవిడ్ మిశ్రమ డోసు టీకాల పట్ల చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ఇది లాభమా నష్టమా అని అడుగుతున్నారని ఆమె తెలిపారు. కానీ ఇది ప్రస్తుతానికి ప్రమాదకరం అని చెప్పారు. ఇలా చేయడానికి సంబంధించి అవసరమైన డేటా కానీ, ఆధారాలు కానీ లేవన్నారు. దీనిపై పరిశోధనలు పూర్తయితే తప్ప ఏమీ చెప్పలేమన్నారు.

కొన్ని ప్రాంతాల్లో తొలి డోసు ఒక రకం కంపెనీ టీకా తీసుకున్న తర్వాత రెండో డోసు సమయాానికి ఆ రకం టీకా అందుబాటులో లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో రెండో డోసుకు ఇంకో రకం టీకాను కొందరు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా ఇలా చేయడం ప్రస్తుతానికి కరెక్ట్ కాదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.