History Of Holi Festival |హోలీ పండుగ అంటే ఏంటీ దాని చరిత్ర..

హోలీ పండుగ అంటే ఏంటీ దాని చరిత్ర...

0
105
History Of Holi Festival

History Of Holi Festival |భారతదేశంలో కులాలకు మాతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ… దీన్నే రంగుల పండుగ, వసంతం అని కూడా పిలుస్తారు… అలాగే పశ్చిమ బెంగాల్ లో దోల్ యాత్రా దోల్ జాత్రా లేదా బసంత ఉత్సవ్ అని అంటారు… ఈ పండుగను ఒక్క మన భారత దేశంలోనే కాదు ఇతర దేశాలు అయినటువంటి నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో జరుపుకుంటారు…

హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలికను కాల్చడంలేదా చోటీ హోలీ అని అంటారు.

History Of Holi Festival |హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు.

Read Also: