తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఫ్యామిలీ

0
117

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరహాస్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత ధ్వజ స్తంభాన్ని మొక్కుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయ మండపంలో సిఎస్ కుటుం సభ్యులకు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి స్వామివారి ప్రసాదాలతోపాటు చిత్రపటాన్ని సిఎస్ కు అందజేశారు. టిటిడిపి సివి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.