కత్తి మహేష్ ట్రీట్మెంట్ కోసం సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం

0
104

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా సిఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదు అందించారు.


నెల్లూరు ప్రధాన రహదారిలో కత్తి మహేష్ యాక్సిడెంట్కు గురయ్యాడు. ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఆయన సీటు బెల్ట్ పెట్టుకోలేదు. యాక్సిడెంట్ లో ఆయన తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక మెరుగైన ట్రీట్మెంట్ కోసం చెన్నై తరలించారు.

ఇప్పటి వరకు కేవలం కుటుంబం మాత్రమే మహేష్ కత్తి హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తూ వచ్చినట్లు అతడి మిత్రులు చెప్పారు. ఇన్స్యూరెన్స్ పాలసీలు క్లైమ్ చేస్తున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ అధికారికంగా భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.