అమ్మవారికి తలసాని తొలి బోనం

-

ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో తొలిబోనం, అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. ముందుగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ EO మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఆలయ పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులను ఆశీర్వదించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. క్యూ లైన్ లలో వచ్చే భక్తులకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. మాస్క్ లు, శాని టైజర్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆలయ EO మనోహర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, కార్పొరేటర్ సుచిత్ర తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...