వచ్చే వారం జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర – యావత్ ప్రపంచం వెయిటింగ్

Jeff Bezos space trip next week- The whole world is waiting

0
122

అమెజాన్ వ్యవస్థాపకుడు బ్లూ ఆరిజన్ చీఫ్ జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు అక్కడ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతరిక్షయాత్రకు సిద్దం అవుతున్నారు. ఇక వచ్చే వారం వీరు యాత్ర చేయనున్నారు. న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా మంగళవారం పశ్చిమ టెక్సాస్ నుంచి సబ్ ఆర్బిటల్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు వెళ్లేవారు ఎవరు అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అలాగే ఆయన సోదరుడు, ఇక 82 ఏళ్ల ఏవియేషన్ నిపుణురాలు, వీరితో పాటు వేలంలో 2.8 కోట్ల డాలర్లకు టికెట్ దక్కించుకున్న మరో వ్యక్తి రోదసిలోకి వెళతారు.

ఇక దీని కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. బ్లూ ఆరిజన్ సంస్థకు ఇదే తొలి అంతరిక్ష యాత్ర. న్యూ షెపర్డ్ వ్యోమనౌక భూమి నుంచి 106 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పారాచూట్ సాయంతో ఎడారిలో ల్యాండ్ అవుతుంది.

ఇప్పటికే మూడు రోజుల క్రితం ఆదివారం వర్జిన్ గెలాక్టిక్కు చెందిన వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక అంతరిక్ష యాత్రకు వెళ్లి క్షేమంగా తిరిగొచ్చింది. అంతరిక్ష నౌక భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి వచ్చింది. ఇప్పుడు న్యూషెపర్డ్ 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనుంది. ఇక నెక్ట్స్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కూడా ఈ యాత్రకు సిద్దం అవుతోంది.