పిల్లలు ఎంత సేపు పడుకోవాలి – ఏ వయసు వారికి ఎన్ని గంటలు నిద్ర అవసరం

0
219

కొంత మంది పడుకుంటే ఉదయం 10 అయినా లేవరు. మరికొందరు మధ్నాహ్నం రెండు మూడు గంటలకు లేచేవారు ఉంటారు. రాత్రంతా వర్క్ చేశాము అంటారు అయితే ఇంకొందరు ఏ వర్క్ లేకపోయినా నైట్ 8 గంటలకి పడుకుని ఉదయం 8 లేదా 9 కి నిద్ర లేస్తారు. అయితే అతిగా పడుకున్నా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం మానసిక వేదన వంటి సమస్యలు వస్తాయి.

బాగా చిన్న పిల్లలు ఏడాదిలోపు వారు ఎక్కువ సేపు పడుకుంటారు . మొదటి ఏడాది వారిని చూస్తే
ఆ పిల్లలు రోజుకు 15 నుండి 16 గంటలు నిద్రపోతారు. మరి ఏ వయసు వారు ఎంత సేపు పడుకుంటారు ఎంత సేపు పడుకుంటే మంచిది అనేది చూద్దాం.

4 నెలల నుండి 12 నెలల శిశువులకు12 నుండి 16 గంటలనిద్ర ఉండాలి
1 నుంచి 3 సంవత్సరాల వారికి 11 నుంచి 14 గంటల నిద్ర ఉండాలి
3 నుండి 5 సంవత్సరాల పిల్లలు 10 నుండి 13 గంటలు నిద్రపోవాలి
6 నుండి 12 సంవత్సరాల వయస్సు వారు 8నుంచి 12 గంటల వరకు నిద్రపోవాలి
టీనేజర్స్ ఎనిమిది నుండి 10 గంటల నిద్ర పోవాలి
ఇలా సరైన టైమ్ ప్రకారం పడుకుంటే జ్ఞాపకశక్తి బాగుంటుందని మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెబుతున్నారు.