వామ్మో సింహం ఇలా కూడా వేటాడుతుందా – ఈ వీడియో మిస్ అవ్వకండి

lion hunts like this too

0
101

అడవిలో పులి సింహం వేటాడితే ఎలా ఉంటుందో తెలిసిందే. అసలు వాటి నుంచి ఏ ప్రాణి తప్పించుకోలేదు. వాటి వేగం, వాటి పంజా పంచ్ అలా ఉంటుంది. చెట్టు మీద ఉన్నా కింద ఉన్నా, ఎక్కడ దాక్కున్నా వాటిని పట్టుకుని చంపేస్తాయి. అందుకే పులులు, చిరుతపులు, సింహాలు వేటాడే తీరు చూడడానికి రెండు కళ్లు చాలవు.

సోషల్ మీడియాలో ఎక్కువగా పులి, చిరుతపులులు, సింహాల వేటకు సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా జూలు విదిల్చి ఓ సింహం గంటల పాటు తీవ్రంగా శ్రమించి అడవి పందిని వేటాడింది. అయితే ఇక్కడ సింహం ఇలా కూడా వేటాడుతుందా అని వీడియో చూసిన వారు అనుకుంటున్నారు. ఎదుకంటే దాని రూపు మారిపోయింది.

మొత్తం బురద బురద అంటుకుపోయింది సింహానికి. బురద భూమిలో దాక్కున్న ఆఫ్రికన్ పందిని ఎంతో ఓర్పుగా వేటాడి మరి సింహం చంపేసి దాని ఆకలి తీర్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది మీరు ఓ లుక్కెయ్యండి..

వీడియో ఇదే