చదువుతూ ముసలోడినైపోతా.. వైరల్‌ అవుతున్న బుడతడి మాటలు

-

జీవితాంతం చదువుతూ చదువుతూ ముసలోడినైపోతా అంటూ ఏడుస్తూ ఓ బుడతడు అంటున్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నేను చదువుకోనంటూ బాలుడు మారం చేస్తుండగా.. ఏడుస్తూ చెప్తున్న ఆ బాలుడు మాటలు ఓ పక్క నవ్వులు పూయిస్తునే, మరోపక్క ఆలోచింపజేస్తోంది. జీవితాంతం చదువుతూ చదువుతూ ముసలోడినైపోతా అంటూ కన్నీరుమున్నీరవుతూ అమాయకంగా చెప్తున్న మాటలు అందరి మోముల్లో చిరనవ్వులు తెప్పిస్తున్నాయి. క,ఖ,గ,ఘలు చదివితేనే ముసలోడివి అయిపోతావా అని అతడి తల్లి ప్రశ్నించగా, మళ్లీ ఆ బాలుడు అదే సమాధానం చెప్పాడు. ఈ వీడియోపై కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతుంటే, మరికొందరు అవును నిజమే మేము చదువుతూనే వృద్ధులం అయిపోయాం అని రాసుకొస్తున్నారు. చదువులంటే చాకిరీగా మారిపోయినట్లు అయిపోయిందనీ, ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలని కొందరు కోరుతున్నారు. చదువుతో పాటు ఆటలు, పాటలు ఉంటే చిన్నారులు ఒక మూస ధోరణిలో కాకుండా, అన్ని విషయాలపై అవగాహన పెంపొందించుకోవచ్చునని అంటున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...