పెద్దాయన పివి నరసింహారావును అవమానించింది వాళ్లే

0
138
pv narasimha rao

తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత నేత మాజీ ప్రధాని పి వి నరసింహారావు జయంతి నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిఆర్ఓ గా పనిచేస్తున్న కంచనపల్లి రమేష్ బాబు ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో తనకు పివి తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆయన రాసిన కథనం యదాతదంగా దిగువన ఇస్తున్నాము…

బహుభాషా కోవిధుడికి ఘన నివాళులతో…

1952 ప్రాంతంలో జరిగిన తొలి ఎన్నికల్లో దివంగత ప్రధాని పి వి నరసింహా రావు గారితో పాటు మా పెద్దనాన్న లు దివంగత కాంచనపల్లి చిన వెంకట రామారావు,ర్కాంచనపల్లి పెద్ద వెంకట రామారావు గార్లు ఎన్నికయిన వారిలో ఉన్నారు. ఆ రకంగా పి వి కుటుంబం తో మా కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడింది.అయితే చిన వెంకటరామారావు గారు అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించగా పెద్ద వెంకటరామారావు గారు కాంగ్రెస్ నుండి ప్రాతినిధ్యం వహించారు.అంతకు ముందు వీరిరువురు నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగస్వామ్యం కావడం జైలు జీవితం అనుభవించడం వంటి పరిణామాలు మా కుటుంబానికి దివంగత పి వి గారితో సాన్నిహిత్యం పెంపొందించేందుకు కారణమయ్యాయి.కాలక్రమంలో చిన్న పెదనాన్న న్యాయవాదిగా స్థిర పడడం తో పాటు నాటి గ్రంధాలయ ఉద్యమం మొదలు తుదిశ్వాస విడిచేవరకు సాహిత్యం తో మమేకం కావడం అదే వరవడిలో బహుభాషాకోవిదుడు గా ప్రసిద్ధి చెందిన పి వి నరసింహా రావు గారితో వేదికలు పంచుకోవడం వంటివి కొంత మేర గుర్తుకు వస్తున్నాయి….తరువాత కాలంలో పి వి గారు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, అత్యున్నత ప్రధాని పదవిని అధిష్టించడం తో చిన పెదనాన్న గారికి కొంత గ్యాప్ ఏర్పడింది. పెద్ద పెద నాన్న గారు దివంగత కాంచనపల్లి పెద్ద వెంకటరామారావు గారు ఆ సంబంధాన్ని కొంత మేర కొన సాగినా నల్లగొండ లోక్సభ స్థానం కోసం బరిలో నిలిచేందుకు గాను ఢిల్లీలో దివంగత ప్రధానులు శ్రీమతి పి వి నరసింహా రావు లను కలిసే క్రమంలో ఢిల్లీ లోని ఏ పి గెస్ట్ హౌస్ లో బంధువు సహచర నేత కాంగ్రెస్ దిగ్గజం దివంగత చకిలం శ్రీనివాసరావు గారితో కలసి కాఫీ సేవిస్తుండగా కాంచనపల్లి పెద్ద వెంకటరామారావు గాయూ గుండెపోటు తో తుది శ్వాస విడిచారు.(సరిగ్గా దివంగత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ చని పోయిన రోజున 11ఫిబ్రవరి 1977 రోజున) అంతటితో ఆయన అనుబందానికి పులిస్టాఫ్ పడింది.

ఆ ఎపిసోడ్ అంతటితో కట్ చేస్తే తదనంతర కాలం లో కాంగ్రెస్ దిగ్గజం చకిలం శ్రీనివాసరావు గారు పరమపదించడం ఆయన స్మారకర్థం కాంగ్రెస్ అభిమానుల కోరిక మేరకు ఆయన తనయులు టి ఆర్ యస్ లో సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్,చకిలం సునీల్ కుమార్ లు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దివంగత ప్రధాని పి వి నరసింహా రావు గారు నల్లగొండ కు రావడం ఆ కార్యక్రమానికి మీడియా లైజనింగ్ అధికారిగా నన్ను నియమించడంతో ఆ మహానేత తో మా కుటుంబానికి ఉన్న బంధాన్ని మరోసారి యాది చేసుకోవడం జరిగింది.ముఖ్య అతిధిగా వచ్చిన దివంగత పి వి నరసింహా రావు గారి పాద పద్మాలకు మొక్కిన నేను ఫలానా అని పరిచయం చేసుకోగా మొత్తం మా బంధువుల ను వారి కుటుంబ సభ్యులను పేరు పేరు నా అడగడం నాకు ఇప్పటికీ గుర్తుకు ఉంది.చిన వెంకటరామారావు కుటుంబాన్ని గుర్తుకు చేస్తూ….భార్య జానకమ్మ పెద్ద కూతురు ఇందిర లను గుర్తుకు ఉంచుకొని పేర్లు పెట్టి అడగడం నన్ను సంబ్రమాచర్యాలకు గురిచేసింది.అంతే కాదండోయ్ ఆ రోజు జరిగిన బహిరంగ సభలోనూ దివంగత కాంచనపల్లి చిన వెంకట్ రామారావు,పెద్ద వెంకటరామరావుల గురించి ప్రస్తావిస్తూ…నల్లగొండ జిల్లాతో నాకున్న సంబంధం ఈ నాటిది కాదు నిజామాంద్ర సభలలో కాంచనపల్లి వారితో ప్రస్థానం మొదలైందని చెప్పడం అరమరికలు లేని ఆయన మనస్సును బయట పెట్టింది.అంతటితో వదల కుండా స్వామి రామనంద తీర్థ కాలం నాటి ముచ్చట్లు చెబుతూ ఆయన సహచరుడిగా ఉన్న నల్లగొండ ఐకాన్ దివంగత పులిజాల రంగారావు పేరును ప్రస్తావించడం తో పాటు బహిరంగ సభ అనంతరం నేరుగా దివంగత పులిజాల రంగారావు గారి యింటికి వెళ్లడం…చివరి రోజుల్లో రంగరావును పరామర్శించడం వంటి మధుర స్మృతులు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి.

అటువంటి మహానేత ఇప్పుడు మన మధ్యన లేరు…ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు అరచేతిలో సాంకేతిక విప్ల వాన్ని తెచ్చి పెట్టింది.అయినా ఆయన మరణాంతరం 10,జనపథ్ ఆయన ను పక్కన పెట్టింది.ఏ ఐ సి సి కార్యాలయానికి ఆయన భౌతిక ఖాయన్ని అనుమతించ లేదు.ఉమ్మడి రాష్ట్రానికి చేరిన ఆయన భౌతిక ఖాయన్ని కాల కుండానే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దాయనను అవమాన పర్చింది.అదే సమయంలో స్వరాష్ట్రంలో సుపరిపాలన అంటూ తెగించి కొట్లాడి తెలంగాణా సాధించిన తెలంగాణా జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. మరణించిన దివంగత ప్రధాని పి వి గారి పేరిట శత జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.బహుభాషాకోవిదుడి పేరు చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే విదంగా నిర్ణయాలు తీసుకున్నారు.ఏమియిచ్చినా రుణం తీర్చుకోలేనంత రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేశారు.అటువంటి మహానేత వర్దంతి సభను అధికారికంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అటువంటి తెలంగాణా బిడ్డడికి తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా బిడ్డడు ఇచ్చే గౌరవానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ

మీ

కాంచనపల్లి రమేష్ బాబు
సీనియర్ జర్నలిస్ట్
9912009999