7 అడుగులు నడిచిన తర్వాత వరుడు నచ్చలేదని చెప్పిన పెళ్లికూతురు

0
123

పెళ్లి కుదిరింది అనగానే సంబురం కాదు. ఆ పెళ్లి అయి తాళికట్టి ఆమె ఇంటికి వచ్చేవరకూ ఏమవుతుందా? అనే గుండె దడ ఇరుకుటుంబాల్లో ఉంటోంది. ఎందుకంటే ఏ సమయంలో ఎవరు వచ్చి మేము ప్రేమించుకున్నామని షాక్ ఇస్తారో అనే టెన్షన్ లో కుటుంబాలు ఉంటున్నాయి. ఇటీవల జరుగుతున్న ఘటనలు పీటల మీద ఆగిపోతున్నపెళ్లిళ్ల వార్తలు తరచూ వింటున్నాము.

తమిళనాడులో తాళి కట్టే ముందు వరుడు నచ్చలేదని ఓ యువతి పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి వెళ్లిపోయింది. ఇది ఇటీవల మనం చూశాం. వరుడు తాగాడు అని పెళ్లికి ఓ అమ్మాయి నో చెప్పింది. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచిన తర్వాత వరుడు నచ్చలేదంటూ వధువు పీటల మీదనుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారు అందరూ షాక్ అయ్యారు.

వరుడు వినోద్ కు, వధువు చందా కు పెద్దలు వివాహం నిశ్చయించారు. జూన్ 29 మంగళవారం ముహూర్తం నిర్ణయించుకున్నాయి రెండు కుటుంబాలు. అబ్బాయి కుటుంబ సభ్యులు అందరూ మండపానికి వచ్చేశారు.వధూవరులిద్దరూ అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేశారు. ఇక అబ్బాయి నచ్చలేదు అని ఆమె మండపం నుంచి కిందకి దిగి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత చెప్పినా ఆమె నో చెప్పింది. ఇక ఆమె తండ్రి పెళ్లి రద్దు అని చెప్పాడు. ఇక వరుడి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకూ అయిన పెళ్లి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఆమె ఎందుకు ఈ పెళ్లి వద్దు
అందో తెలియలేదు.