ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల-టిటిడి  

Tirumala Tirupathi Devasthanam Updates

0
121

తిరుమల సమాచారం : (22-06-2021)

? నిన్న జూన్ 21 వ‌ తేదీన శ్రీవారిని 15,973 భక్తులు దర్శించుకున్నారు.
‌ ‌
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 1.41 కోట్లు

? నిన్న శ్రీవారి తలనీలాల సమర్పించిన భక్తులు 6,618 మంది.

? తిరుపతిలో ప్రతి రోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీని టిటిడి  నిలిపివేసింది.

? కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో టైమ్ స్టాట్ టోకన్ల జారీ నిలిపివేసిన టిటిడి…

నేడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

భక్తుల సౌకర్యార్థం జులై నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవ్వాళ ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకు 5 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేసారు.ఉదయం 9.00 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ కోటాను టీటీడీ విడుదల చేసింది.

కాగా, జులై నెలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 23న బుధవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి  కోర‌డ‌మైన‌ది.