యాదాద్రి జిల్లా కొత్త కలెక్టర్ పమేలా సత్పతి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆమె ఛార్జ్ తీసుకుని వారం రోజులు గడుస్తున్న తరుణంలో పరిపాలనపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. వచ్చి రాగానే సమాచార శాఖ అధికారిణిపై వేటు వేశారు. దీంతో మిగిలిన యావత్ సిబ్బంది కి టెన్షన్ మొదలైంది.
వరంగల్ నగర పాలక సంస్థ నుంచి పమేలా సత్పతి బదిలీపై యాదాద్రి కలెక్టర్ గా వచ్చారు. యాదాద్రి కలెక్టర్ గా ఉన్న అనితా రామచంద్రన్ ను బదిలీ చేస్తూ ఆమె స్థానంలో పమేలా సత్పతిని నియమించారు సిఎం కేసిఆర్. ప్రస్తుతం పమేలా సత్పతి అడ్మినిస్ట్రేషన్ ను తన కంట్రోల్ లోకి తెచ్చుకునే క్రమంలో దూకుడు మీదున్నారు. జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) పద్మ మీద వేటు వేశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తున్న కారణంగా పద్మను సమాచార శాఖ (ఐఅండ్ పిఆర్ )కు అలాట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త కలెక్టరమ్మ దూకుడు చూస్తే విధుల పట్ల అలసత్వం వహిస్తున్న అధికారుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయంగా కనబడుతున్నది. ఇప్పుడిప్పుడే అధికార యంత్రాంగమంతా సెట్ రైట్ అవుతున్నారని జిల్లా వర్గాల్లో టాక్.