మారుతున్న లివింగ్ స్టైల్ కారణంగా చాలామంది ఇంటి ఫుడ్ కంటే బయటి ఫుడ్ నే ఎక్కువగా తీసుకోవాల్సి వస్తోంది. ఔట్ సైడ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయలేము. అందులోనూ చూడగానే నోరూరించే జంక్ ఫుడ్ ఇగ్నోర్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.
ఫ్రైడ్ ఫుడ్స్ ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. సాయంత్రపు స్నాక్స్ లా ఫ్రెంచ్ ఫ్రైస్ కే ఎక్కువ ఓట్స్ పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఫ్రెంచ్ ఫుడ్స్ అతిగా లాగించేవారికి ఒక బ్యాడ్ న్యూస్. తాజాగా జరిగిన అధ్యయనంలో ఫ్రైడ్ ఫుడ్(Fried Food), ఫ్రెంచ్ ఫ్రైస్(French Fries) కి ఎంత దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి అంత మేలు అని తేలింది.
మనం తినే ఆహారం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. వాషింగ్టన్ యూనివర్శిటీలోని సెయింట్ లూయిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో నిర్వహించిన ఒక కొత్త అధ్యయనంలో.. వేయించిన ఆహారాలు, ముఖ్యంగా వేయించిన బంగాళాదుంపలు తరచూ తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్‌కు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని తేలింది.
ఈ అధ్యయనంలో 140,728 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వీరికి వేయించిన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించారు. తరచూ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల వీరిలో 12% ఆందోళన, 7% డిప్రెషన్ లెవెల్స్ పెరిగాయని అధ్యయనంలో తేలింది. ఫ్రైడ్ ఫుడ్స్(Fried Food, French Fries) లో ఉండే అక్రిలమైడ్ కంటామినెంట్ ఆందోళన, డిప్రెషన్ ను పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ అధ్యయనం ఫలితాలు వేయించిన ఆహారాన్ని ఇష్టపడేవారికి నిరాశ కలిగించినప్పటికీ, తినే ఆహరం మన మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియజేస్తోంది. కాబట్టి మనం తినే వాటిపై మరింత శ్రద్ధ చూపడం ద్వారా, కొన్ని మానసిక రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మానసిక రుగ్మతలతో బాధపడేవారు ఫ్రైడ్ ఫుడ్స్ కి బదులు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఫ్రై చేసిన ఆహరం కంటే… ఉడకబెట్టిన, ఆవిరి మీద వండిన ఆహార పదార్ధాలు తీసుకుంటే ఉత్తమం అని చెబుతున్నారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పొగాకు, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Read Also: రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సిన డిన్నర్ టీ
Follow us on: Google News, Koo, Twitter