5వ రోజు అల వైకుంఠపురము కలెక్షన్లు అదిరిపోయాయి

5వ రోజు అల వైకుంఠపురము కలెక్షన్లు అదిరిపోయాయి

0
136

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురములో.. మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. విడుదల అయిన తొలిరోజు నుంచి వసూళ్లలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 35 కోట్ల షేర్ రాబట్టింది.. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. అలాగే ఓవర్సీస్లో త్రివిక్రమ్కు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. దీంతో అక్కడ ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

అల వైకుంఠపురములో 1.88 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేయగా, సరిలేరు 1.82మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది..ఐదో రోజు అల వైకుంఠపురములో వసూళ్లు 10 నుంచి 11కోట్ల మధ్య ఉన్నాయట. ఐదో రోజు ఈ చిత్రానికి వసూళ్ల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల 9.5 నుంచి 10కోట్ల మధ్య ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 10.6 నుంచి 11కోట్ల మధ్య ఉండబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 96కోట్ల షేర్, 134కోట్ల గ్రాస్ను రాబట్టిందని టాక్. అయితే ఈ సినిమా దాదాపు 150 కోట్ల షేర్ అలాగే 180 నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుంది అని అంటున్నారు.. అభిమానులు కూడా దీనిపై ఆశలు పెట్టుకున్నారు, ఈ సినిమా ఈ సంక్రాంతికి సూపర్ హిట్ గా బన్నీకి నిలిచింది.