టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ & డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే మరో సిరీస్ తెరకెక్కుతుండగా వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్‌కి ఇది ఇండియన్ వర్షన్ అని, ప్రీక్వెల్ అని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సిరిస్. తాజాగా సమంత, వరుణ్ ధావన్, రాజ్ & డీకే, మరి కొంతమంది సిటాడెల్ టీం తాజాగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని(Draupadi Murmu) కలిశారు. ఆమెతో కొద్ది సమయం గడిపారు. సిటాడెల్ సిరీస్ గురించి, పలు సినిమాల గురించి మాట్లాడారు సిటాడెల్ యూనిట్. సిటాడెల్ టీం రాష్ట్రపతిని కలిసిన ఫోటోలు వరుణ్ ధావన్, రాజ్ & డీకే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత అభిమానులు, పలువురు నెటిజన్లు సమంతను, సిటాడెల్ టీంని అభినందిస్తున్నారు.