Adipurush | డివైడ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ‘ఆదిపురుష్’

-

రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్(Adipurush)’ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపాయి. బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. తొలిరోఉజు ప్రపంచవ్యాప్తంగా రూ.138.64కోట్లు(గ్రాస్) వచ్చినట్లు సినీ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.50.93కోట్లు, హిందీలో రూ.48.24 కోట్లు, కర్ణాటకలో రూ.8.57కోట్లు, తమిళనాడు, కేరళలో రూ.2.35కోట్లు.. విదేశాల్లో రూ.26.75కోట్లు వచ్చినట్లు చెబుతున్నాయి.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఓసారి ఏరియా వారీగా Adipurush తొలిరోజు వసూళ్లు పరిశీలిస్తే..

నైజాం – రూ.13.68కోట్లు

సీడెడ్ – రూ.3.52కోట్లు

ఉత్త‌రాంధ్ర – 3.72 కోట్లు

ఈస్ట్ – రూ. 2.78 కోట్లు

వెస్ట్ – రూ. 2.24 కోట్లు

గుంటూరు – రూ.4 కోట్లు

కృష్ణా – రూ.2 కోట్లు

నెల్లూరు – రూ. 90 లక్షలు

ఇక ఈ చిత్రంలో శ్రీరాముడుగా ప్రభాస్, సీతా దేవిగా కృతి స‌న‌న్(Kriti Sanon) న‌టించారు. లంకాధిప‌తి రావ‌ణ బ్ర‌హ్మ‌గా సైఫ్ అలీఖాన్ న‌టించారు. టీసిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ సినిమాను త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో తెర‌కెక్కించారు. భారీ అంచనాలతో విడుదలైనా ఈ సినిమా మొదటి ఆట నుండే ప్రేక్షకులు నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నెటిజన్లు ఈ సినిమా మీద ట్రోల్స్ మొదలెట్టేశారు.

Read Also:
1. ‘ఆదిపురుష్’ చూసిన సీత.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపుకి ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....