మౌనంగా ఉంటె రాత్రికి రమ్మంటారు.. అదితిరావు హైదరీ..!!

మౌనంగా ఉంటె రాత్రికి రమ్మంటారు.. అదితిరావు హైదరీ..!!

0
48

తెలుగులో సమ్మోహనం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితిరావు హైదరీ… వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమాలోనో ఓ కీలకపాత్రలో నటించిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాని , ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా లో ఓ హీరోయిన్ గ నటిస్తుంది.. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీ లో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది..

సినిమా ఇండస్ట్రీ లో లైంగీక వేధింపులు ఉన్నాయి.. ఒక సినిమా విషయం లో నాకు ఇదే అనుభవం ఎదురైంది.. సర్దుకుపోతే అవకాశం ఇస్తాము.. లేదంటే ఈ ఛాన్స్ వేరొకరికి వెళ్తుంది.. ఆలోచించుకుని నిర్ణయం చెప్పండి అన్నారు. అలా అవకాశం సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు, అందుకే నో చెప్పి ఆ ప్రాజెక్ట్ ని వదిలేశానని అంది.. లైంగీక వేధింపు లు ఎదురైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. మౌనంగా ఉంటె ఆ మౌనాన్ని మరోరకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ” అని చెప్పుకొచ్చింది..