ఆహుతి ప్రసాద్ తనయుడుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు..!!

ఆహుతి ప్రసాద్ తనయుడుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు..!!

0
79

దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ గురించి తెలియనివారుండరు. వందలాది చిత్రాల్లో తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. కోనసీమ యాసలో డైలాగులు చెప్పడంలో ఆహుతి ప్రసాద్ కు ప్రత్యేకమైన శైలి ఉంది. తాజాగా ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్ వార్తల్లో నిలిచారు. కార్తీక్ ప్రసాద్ పై బంజారాహిల్స్ పోలీస్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళదాం.

ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్‌ లేచి నిలబడలేదు. దీంతో అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్‌ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినకార్తీక్ ప్రసాద్ కు బుద్ది చెప్పాలని సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్స్ లో జాతీయ గీతం ప్లే చేయాలనే నిబంధనని ప్రభుత్వం తీసుకువచ్చాక దీనిపై సర్వత్రా చర్చ జరిగింది. థియేటర్స్ లో జాతీయ గీతం అవసరమా అని వ్యక్తిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు.