గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ..!!

గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ..!!

0
62

ఏపీలో రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొద్ది సేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. 25 మంది కొత్త మంత్రులతో రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ చేరుకున్న గవర్నర్ ను సీఎం జగన్ కలుసుకున్నారు.

రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు. రేపు ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.