సెప్టెంబర్ 19న #AKHIL3 ఫస్ట్‌లుక్‌ రిలీజ్

సెప్టెంబర్ 19న #Akhil3 ఫస్ట్‌లుక్‌ రిలీజ్

0
60

అక్కినేని అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 19న సాయంత్రం 4గంటలకు అఖిల్ ఫస్ట్‌లుక్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. బీవీఎస్‌ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.