అక్కినేని అఖిల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఏజెంట్(Agent). ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చిరంజీవితో సైరా వంటి భారీ బడ్జెట్ చిత్రం తీసిన సురేందర్ రెడ్డి ఏజెంట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. అయితే, మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న అఖిల్(Akkineni Akhil) తొలిసారి యాక్షన్ సినిమా చేయడం.. అందులోనూ సిక్స్ ప్యాక్ బాడీతో కనబడనుండటంతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ క్రమంలో సినిమా(Agent)కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్‌లోనే జరిగింది. ఏజెంట్ సినిమాకు దాదాపు రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అఖిల్ మొదటి సినిమా తర్వాత అత్యధిక బిజినెస్ జరిగింది ఈ సినిమాకే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.38 కోట్లు రాబట్టాల్సి ఉంది. నిజానికి ఇది అఖిల్‌కు పెద్ద టార్గెటే. సూపర్ హిట్ టాక్ సైతం తెచ్చుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ కేవలం రూ.25 కోట్ల షేర్‌ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ లెక్కన అఖిల్‌కు ఇది పెద్ద టార్గెటే. మరి సాధిస్తాడో లేదో చూడాలి.
Read Also: మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్వీట్ వార్నింగ్
Follow us on: Google News, Koo, Twitter