ప‌వ‌న్ అభిమానుల‌కు బిగ్ షాక్ రూట్ మార్చిన అకీరా

ప‌వ‌న్ అభిమానుల‌కు బిగ్ షాక్ రూట్ మార్చిన అకీరా

0
93

ఇరు తెలుగు రాష్ట్రాల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్లు అయింది. రేణు దేశాయ్… ప‌వ‌న్ దంప‌తుల త‌న‌యుడు అకీరా నంద‌న్ హీరోగా ఎప్పుడెప్పుడు తెర‌పై క‌నిపిస్తాడా, ఆయ‌న్ను చూసి ఎప్పుడెప్పుడు విజిల్స్ తో థియేట‌ర్స్ ను మారు మోగించాల‌నే ఉద్దేశంతో ప‌వ‌న్ అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశ‌లు నిరాశ‌లు అయ్యాయి.

తాజాగా రేణుదేశాయ్ ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ అకీరా నంద‌న్ గుంచి ప్ర‌స్తావించారు. అకీరా ప‌లాన ప్రొఫిష‌న్ లో ఎద‌గాల‌నే విష‌యంలో ఇంకా క్లారిటీ లేద‌ని అన్నారు. త‌న‌కు న‌చ్చిన విధంగా తాను ఉండాల‌నుకుంటున్నార‌ని అన్నారు. ఎందుకంటే ప్ర‌తీ ఏడాది త‌న ప్రొఫిష‌న్ కి సంబంధించిన ఆశ‌యం మారిపోతుంద‌ని రేణు అన్నారు.

గ‌త ఏడాది క్రికెటర్ ఇష్ట‌మ‌ని చెప్పి క్రికెట్ నేర్చుకున్నార‌ని, ఆ త‌ర్వాత బాస్కెట్ బాల్ ప‌ట్ల ఆస‌క్తితో బాస్కెట్ బాల్ నేర్చుకున్నార‌ని దాని త‌ర్వాత రైట‌ర్ కావాల‌ని ఉంద‌ని చెప్పార‌ని అన్నారు. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవ‌ల‌ని ఉంద‌ని అంటున్నాడ‌ని రేణు తెలిపింది. ఇలా ప్ర‌తీ ఇయ‌ర్ అకీరా ప్రొఫిష‌న్ మారిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పిల్ల‌ల‌ను క్ర‌మ‌శిక్షలో పెడ్డ‌టం త‌ల్లి బాధ్య‌త అని కానీ తాను ఏం కావాల‌న్న‌ది అకీరానే నిర్ణ‌యించుకుకోవాల‌ని రేణు చెప్పారు.