త్రివిక్రమ్ తో ముచ్చట గా మూడో సారి

త్రివిక్రమ్ తో ముచ్చట గా మూడో సారి

0
88

త్రివిక్రమ్,అల్లు అర్జున్ ఈ ఇద్దరు కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఈ రోజు ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇంతకముందు త్రివిక్రం డైరక్షన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను చేసిన బన్ని ముచ్చటగా మూడవ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ స్టోరీతో వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో బన్నికి జోడీగా పూజా హెగ్దెని తీసుకునట్లు సమాచారం. డిజేలో అల్లు అర్జున్ తో జోడీ కట్టిన పూజా మరోసారి అతనితో రొమాన్స్ చేస్తుంది. అజ్ఞాతవాసి తర్వాత ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం చేసిన అరవింద సమేత సినిమాలో కూడా పూజా హీరోయిన్ గా నటించింది. మొత్తానికి కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న అల్లు అర్జ్ 19వ సినిమా ఈరోజు ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 24 నుండి మొదలుపెడతారట. హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు .