విక్టరీ వెంకటేశ్ హీరోగా వస్తున్న సైంధవ్(Saindhav) అనే పాన్ ఇండియా సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. వెంకటేశ్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం కానుంది. ఈ సినిమాలో తమిళ నటి ఆండ్రియా కీలకపాత్ర పోషిస్తుంది. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆండ్రియా(Andrea Jeremiah) జాస్మిన్ పాత్రలో నటించనుంది. చేతిలో గన్ను పట్టుకుని ఇంటెన్సీవ్‌గా చూస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌తోనే ఆండ్రియా క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఇక ఇన్నేళ్ల తర్వాత ఆండ్రియా తెలుగు సినిమా చేయనుండటంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆండ్రియా(Andrea Jeremiah) తెలుగు ప్రేక్షకులకు నటిగా కంటే సింగర్‌గానే ఎక్కువగా దగ్గరైంది. బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కింగ్, దడ వంటి పలు సినిమాల్లో తెలుగులో దాదాపు పదిహేను పాటల వరకు పాడింది. ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ సినిమాల్లో పాటలు పడింది.
Andrea Jeremiah |వెంకటేశ్ సైంధవ్ చిత్రం నుంచి హీరోయిన్ అప్‌డేట్
-