అరవింద సామెత ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

అరవింద సామెత ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

0
127

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రం మొత్తం రాయలసీమ నేపథ్యం లో తెరకెక్కుతుంది. ఈ దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త ఫిలిం నగర్ లో తెగ హల చల్ చేస్తుంది .ఈ సినిమా పాటలను ముందుగా ఒక్కోటిగా రిలీజ్ చేయాలని భావించినా, అనూహ్యంగా హరికృష్ణ గారి అకాల మృతి వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఇప్పుడు ఒక్కోటిగా రిలీజ్ చేయడం కన్నా ఒకేసారి పాటలను రిలీజ్ చేయాలని అందరూ డిసైడ్ అయ్యారట.

దీనితో అరవిందసమేత సాంగ్స్ ని ఈ నెల 23 న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు 23 వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు .