మరో సారి అరవింద సామెత షూటింగ్ ఫొటోస్ లీక్

మరో సారి అరవింద సామెత షూటింగ్ ఫొటోస్ లీక్

0
89

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం అరవింద సామెత ఈ సినిమా షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకులు ఆగడం లేదు. మళ్ళీ పొటోలు లీక్ అయ్యాయి.ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ జీప్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని తలవంచి పక్కకు చూస్తున్నాడు. సీరియస్ గానే అయిన కాస్తా దిగాలుగా ఉన్నట్టు అనిపిస్తోంది. పోలీస్ బెటాలియన్ ఎన్టీఆర్ జీపు వెనక ముందు గ్రీన్ టోపీలు పెట్టుకుని ఉన్నారు. వాళ్లతో పాటు జనాలు కూడా చుట్టూ మూగి ఉన్నారు.

ఈ ఫోటో మాత్రం సినిమాలో ఒక హై ఎమోషన్ ఉన్న సీన్ లోనిది అని మాత్రం అర్థం అవుతోంది. అయితే ఈ ఫోటో అభిమానుల్లో సినిమాపై ఆత్రుతని పెంచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ‘నోవాటెల్’ హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.