జూ.ఎన్టీఆర్ అరవింద సామెత మరో రికార్డు

జూ.ఎన్టీఆర్ అరవింద సామెత మరో రికార్డు

0
154

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. అక్టోబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో నంబర్ వన్‌ ట్రెండింగ్‌లో ఉండగా విడుదలైన కొద్ది గంటల్లోనే 70 లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది.2 లక్షల 95 వేల మంది లైక్‌ కొట్టారు.

ట్రైలర్ లో మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా? , 30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ ,సర్‌ వంద అడుగుల్లో నీరు పడుతుంది అంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సర్‌. తవ్వి చూడండి’ అంటూ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.