సుదీప్‌కు గాయాలు… ఆలయాల్లో పూజలు చేస్తున్న ఫ్యాన్స్

సుదీప్‌కు గాయాలు… ఆలయాల్లో పూజలు చేస్తున్న ఫ్యాన్స్

0
71

ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఆయన గాయపడ్డారు. తాజాగా పైల్వాన్ సినిమా షూటింగ్‌లో గాయపడినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయనకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన ఇటీవల జరిగిన ది విలన్ టీజర్ విడుదల కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని ఆయన అభిమానులు చెబుతున్నారు.

సుదీప్, శివరాజ్‌కుమార్ కలిసి నటించిన ది విలన్ సినిమా అక్టోబరు 18న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అమీ జాక్సన్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు