కౌశల్ కు అభినందనలు తెలిపిన మహేష్ బాబు

కౌశల్ కు అభినందనలు తెలిపిన మహేష్ బాబు

0
150

బిగ్‌బాస్ 2 లో విజేత కౌశ‌ల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. ఎంతో ఉత్కంఠ‌తో జ‌రిగి బిగ్‌బాస్ సీజ‌న్‌లో కౌశ‌ల్ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అస‌లు కౌశ‌ల్ నెగ్గుతాడా? లేదా? అని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు కౌశ‌ల్ బిహేవ్ చేయ‌డం.. సోష‌ల్ మీడియాలో కౌశ‌ల్ ఆర్మీ కౌశ‌ల్‌కు స‌పోర్ట్ పోస్టులు చేయ‌డంతో కౌశ‌ల్ విజేత‌గా నిలిచాడు.

కౌశ‌ల్ టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు పెద్ద అభిమాని.. కెరీర్ ప్రారంభంలో మోడ‌లింగ్ ఏజెన్సీ పెట్ట‌మ‌ని కౌశ‌ల్‌ను మ‌హేశ్ ఎంక‌రేజ్ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని కౌశ‌ల్ ఓ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు కూడా. కాగా.. కంగ్రాట్స్ కౌశ‌ల్.. ఇది పెద్ద విజ‌యం.. నీ విజ‌యం ప‌ట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ స‌క్సెస్‌ను ఎంజాయ్ చెయ్‌“ అంటూ త‌న అభిమాని కౌశ‌ల్‌కి సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌లు అంద‌చేయ‌డం గ‌మ‌నార్హం.