అరవింద సమేత ట్రైలర్ రిలీజ్ ఆ రోజే

అరవింద సమేత ట్రైలర్ రిలీజ్ ఆ రోజే

ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు అందరూ అరవింద సమేత వీర్ రాఘవ ఆడియో పాటలను ఎంజాయ్ చేస్తున్నారు .అయితే ఇప్పుడు అభిమానుల అందరి చూపు అరవింద సమేత ట్రైలర్ పైనే ఎందుకంటే అరవింద టీజర్ లో కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే చూపించాడు ఇందులో త్రివిక్రమ్ మార్క్ కూడా ఎక్కడ కనిపించ లేదు అంటూ చాలా విమర్శలు వచ్చాయి. దీంతో అభిమానులు అంతా ట్రైలర్ గురించి ఎదురు చూస్తున్నారు

తాజాగా ఈట్రైలర్ కోసం తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని సమాచారం. త్రివిక్రమ్ ట్రైలర్ ను చాలా బాగా కట్ చేశాడని ఈ ట్రైలర్ తో ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అక్టోబర్ 2న హైదరాబాద్లో సాయంత్రం 6గంటలకు జరుగనుంది. అదే రోజు ఈ ట్రైలర్ ను విడుదలచేసే అవకాశం వుంది.