ప్రపంచంలో రికార్డులెకక్కనున్న అవెంజర్స్ సినిమా

ప్రపంచంలో రికార్డులెకక్కనున్న అవెంజర్స్ సినిమా

0
96

ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అవతార్ రికార్డులో ఉంది.. 2 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇక తాజాగా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా కోసం పెద్ద ఎత్తున జనాలు ఎదురుచూస్తున్నారు. ఎండ్ గేమ్ కావడంతో ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం తొలిరోజు చూడాలి అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో అన్నీ సీట్లు బుక్ అయ్యాయి, వీకెండ్స్ కు కూడా ప్లాన్ చేసుకున్నారు. మూడు రోజుల వరకూ హైదరాబాద్ లో టికెట్స్ లేవు అంటే ఎలాంటి పరిస్దితి ఉందో తెలుసుకోవచ్చు.

దాదాపు 20 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు ఈ సినిమా గురించి అంచనా వేస్తున్నారు. ఇండియాలో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. . ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. అయితే చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో ఈ సినిమా విడుదలైంది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమా తొలి రోజు సంచనాలు నమోదు చేసింది. ఒక్క రోజులోనే దాదాపు 750 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చెప్పుతున్నారు.. ఇలాగే వసూళ్లు వస్తే 25 వేల కోట్ల రూపాయలు ఈ చిత్రం వసూళు చేస్తుంది అని చెబుతున్నారు సినీ ట్రేడర్లు.