వైసీపీ ఇంచార్జులకు కీలక పిలుపు

వైసీపీ ఇంచార్జులకు కీలక పిలుపు

0
65

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో చేసిన ఒక తప్పు ఉంది.. తన పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటున్న సమయంలో గుర్తించకపోవడం.. అయితే ఈసారి టఫ్ వార్ జరగడంతో మరోసారి టీడీపీ ఇలా ఫిరాయింపులకు పాల్పడే అవకాశం ఉంది అని జగన్ ఆలోచించారు.. అందుకే గత ఎన్నికల్లో జరిగిన తప్పు ఈసారి జరగకూడదు అని చూస్తున్నారట. ముఖ్యంగా పార్టీ తరపున రిజల్ట్ రోజున ఎవరికి అయితే గెలుపు వస్తుందో వారిని వెంటనే ఓ సీక్రెట్ ప్లేస్ కు తరలించాలి అని చూస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈసారి వైసీపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొత్త ప్రణాళిక వేసింది, అలాగే ప్రచారం చేశారు. ఈసారి పార్లమెంట్ ఇంచార్జులను నియమించారు. వీరు అందరికి ఎవరు గెలిస్తే వారిని అందరిని తీసుకుని జగన్ వద్దకు తీసుకువచ్చే బాధ్యత కూడా అప్పగించారు అని తెలుస్తోంది. పార్టీ మార్చే నాయకులకు జగన్ టిక్కెట్లు ఇవ్వలేదు అని, కేవలం కొందరు మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. ఫిరాయింపులు అనే పరిస్దితి ఉండదు అని చెబుతున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్ కు ఇక్కడ పార్టీ ఫిరాయింపులు గత ఎన్నికల్లో ఎలాంటి దారుణమైన పరిస్దితిని తీసుకువచ్చాయో తెలిసిందే. ఇప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్ వేస్తున్నారట. మరి జగన్ ప్లాన్స్ కు అనుగుణంగా నేతలు కూడా కలసి పనిచేయాలి అని ఫలితాల రోజు పార్టీ నేతలను చేజార్చు కోకూడదు అని వైసీపీ కేంద్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చిందట.