RRR కు గాయాల బెడద..దిక్కుతోచని స్థితిలో రాజమౌళి..!!

RRR కు గాయాల బెడద..దిక్కుతోచని స్థితిలో రాజమౌళి..!!

0
48

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా RRR.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం లో ఓ హీరోయిన్ గా అలియా భట్ ఎంపిక కాగా రెండో హీరోయిన్ కోసం మరో బాలీవుడ్ కథానాయికను ఎంపిక చేయనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, డీవీవీ దానయ్య ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటించనున్నారు..

ఏ సినిమా నైనా పర్ఫెక్ట్ గా తెరకెక్కించే రాజమౌళి RRR కి మాత్రం కొంచెం కష్టపడుతున్నాడట.. దానికి కారణం ఇద్దరు హీరోలకు గాయాలు కావడం.. మొదట రామ్ చరణ్ కి గాయం కాగా డాక్టర్స్ చరణ్ కి నెల రోజుల విశ్రాంతి అవసరం అన్నారు.. అంతేకాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా గాయం కావడంతో రాజమౌళి ఎటు తేల్చుకోలేకపోతున్నాడట.. అసలే భారీ కాస్టింగ్ తో సినిమా తెరకెక్కుస్తున్న రాజమౌళి కి ఇలా గాయాల బెడదతో ఎం చేయాలో అని ఆలోచిస్తున్నాడట.. మరి వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారో మళ్ళీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో చూద్దాం..