రాజశేఖర్ కి కలిసి వస్తున్న అదృష్టం..!!

రాజశేఖర్ కి కలిసి వస్తున్న అదృష్టం..!!

0
75

జీవిత రాజశేఖర్.. 90 వదశకంలో హీరో రాజశేఖర్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.. అప్పట్లోనే భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో రాజశేఖర్.. ఆతర్వాత వరుస ఫ్లాప్స్ ఆయన్ని ఎదగనీయకుండా చేశాయి.. దాంతో కొన్ని రోజులు వెండితెరపై కనిపించలేదు.. ఆ ఆతర్వాత చిరంజీవి తో వివాదం ఆయన్ని మరింత ఊబిలోకి నెట్టేసింది.. ఠాగూర్ సినిమా విషయంలో వీరిద్దరికి అభిప్రాయం భేదాలు రాగ, వారి మధ్య వైరం కొన్ని సంవత్సలుగా కొనసాగింది..

ఇకపోతే రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో గ్రాండ్ గా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.. గరుడవేగా సినిమా తో రాజశేఖర్ సూపర్ హిట్ కొట్టి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు.. ఆ వెంటనే ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మ తో కల్కి అనే సినిమా చేయబోతున్నారు.. ఇదిలా ఉంటె ఇన్ని రోజులు ఎంతో బ్యాడ్ గా ఉన్న అయన సిట్యువేషన్ ఇప్పడు కలిసి వస్తుందని చెప్పొచ్చు.. ఓ వైపు సినిమా లు హిట్ అవుతున్నాయి.. అటు కూతుళ్లు ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్నారు.. మరో వైపు ఇటీవలే రాజకీయ అరంగేట్రం చేసిన రాజశేఖర్ కి ఆయన సపోర్ట్ చేస్తున్నా పార్టీ గెలిచే స్థితి లో ఉండడం, మా ఎలక్షన్ లో కూడా ఘన విజయం సాధించడం ఇవన్నీ చూస్తుంటే రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తుంది..