పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిన భరత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిన భరత్ రెడ్డి

0
43

తెలుగు లో బయోపిక్ ల హవా కొనసాగుతుంది.క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో మరో ఆర్టిస్టు కూడా జాయిన్ అవుతున్నాడు. ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలలో నటించిన డాక్టర్ భరత్ రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రయిన ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా నటించడానికి ఎంపికయ్యాడు. అయితే తాజాగా ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు భరత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ని చాలామంది అదేపనిగా పొగుడుతూ అతడి దృష్టిలో అలాగే పవన్ అభిమానుల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారని నాకు అది నచ్చదని అనేశాడు .

నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ని అదేపనిగా పొగడలేదని , అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి చెబుతున్నదంతా నిజం కాదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక పవన్ నిజాయితీ పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నాడు డాక్టర్ భరత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ తో కలిసి అత్తారింటికి దారేది చిత్రంలో నటించాడు డాక్టర్ భరత్ రెడ్డి . భరత్ టాలీవుడ్ లో క్యారెక్టర్ నటుడిగా రాణించిన సంగతి తెలిసిందే.