Movie Review: భీమ్లానాయక్ మూవీ రివ్యూ..పవన్, రానా విశ్వరూపం

0
41

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్​ అయింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలు మోత మొగుతున్నాయి. ఈ సినిమాతో ‘పవర్​ తుపాను’ ఖాయమే అంటున్నారు ఫ్యాన్స్. మలయాళ సినిమాకు రీమేక్​గా తెరకెక్కినప్పటికీ..పవన్, రానా కలిసి నటించడం సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తుంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాయడం విశేషం. నేడు ప్రపంచవ్యాప్తంగా భీమ్లానాయక్ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో పవన్ మరో హిట్ కొట్టాడా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..

అయితే  ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..పవన్ నటిస్తున్న రెండో మల్టీస్టారర్ ఇది. గతంలో బాబాయ్ విక్టరీ వెంకటేశ్​తో ‘గోపాల గోపాల’ చేయగా, ఇప్పుడీ సినిమాలో అబ్బాయ్ రానాతో కలిసి తెర పంచుకున్నారు. పవన్ కల్యాణ్ పోలీసు దుస్తుల్లో కనిపించిన నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘పులి’, ‘గబ్బర్ సింగ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్​’ సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో పవన్, ‘భీమ్లా నాయక్’ అనే గిరిజన ఎస్సై పాత్ర చేయడం మరో విశేషం. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవగా అలరించిన రానా.. ఇందులో పవన్​తో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు. దీంతో సినిమాలో వీరిద్దరి మధ్య సన్నివేశాల కోసం ఫ్యాన్స్​ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కథ ఏంటంటే:

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా భీమ్లా నాయక్ కి (పవన్ కళ్యాణ్) మంచి పేరు ఉంటుంది. డ్యూటీ కరెక్ట్ గా చేసే భీమ్లా నాయక్ కి ఎక్స్ ఎంపీ కొడుకు డేనియర్‌ శేఖర్‌ (రానా దగ్గుబాటి) అహంకారంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరుకుతాడు. ఈ కేసు విషయంలో డ్యానీని భీమ్లా నాయక్‌ జైలుకు కూడా పంపుతాడు. తాను బెయిల్‌ పై వచ్చాక నీ అంతు చూస్తా అన్నట్లుగా డ్యానీ., నాయక్‌ కు వార్నింగ్‌ ఇస్తాడు. వారిద్దరి మధ్య వైరం నెలకొంటుంది. డ్యానీ తండ్రి అతని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. అలాగే భీమ్లా భార్య సుగుణ కూడా భర్తను ఏ మాత్రం తగ్గొద్దంటూ కోపాన్ని నూరి పోస్తుంది. తరువాత భీమ్లా ఇంటిని డ్యానీ కూల్చి వేయడం, డ్యానీ కారును భీమ్లా పేల్చి వేయడం ఇలా సినిమాలో చాలా సంఘటనలు జరుగుతాయి. చివరకు భీమ్లా, డ్యానీ ఇద్దరూ ఒకరికిపై ఒకరు దాడికి కూడా దిగుతారు. ఒకరినొకరు చితకొట్టేసుకుంటారు. భీమ్లా చేతిలో డ్యానీ చావడం ఖాయమని తేలుతుందిద. అదే సమయంలో.. డ్యానీ భార్య వచ్చి భీమ్లాను వేడుకుంటుంది. ఒకప్పుడు ఆమె చిన్న తనంలో భీమ్లా కాపాడి ఉంటాడు. అందువల్ల ఈ సారి కూడా ఆమె కోసం భీమ్లా, డ్యానీని వదిలేస్తాడు. ఆ పై భీమ్లా వేరే ఊరికి బదిలీ అవుతాడు. ఓ సంవత్సరం తరువాత భీమ్లా, డ్యానీ కలుసుకుంటారు. ఇద్దరూ కరచలనం చేసుకోవడంతో కథకు శుభం కార్డు పడుతుంది.

ఎవరెలా చేసారంటే?

సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా అబ్బురపరిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ గా సాగే సన్నివేశంలో పవన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ గా పవన్ నట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అహంకారానికి పర్యాయపదంలా ‘రానా’ పాత్ర నిలిచింది. ఆ పాత్రలో రానా తన నటనతో ఒదిగిపోయారు. రానా నటన కూడా తార‌స్థాయిలో ఉంది. రానా – పవన్ మధ్య ఎమోషన్ కూడా చాలా బాగా పడింది. ప‌వ‌న్ భార్యగా నిత్య మేనన్‌ కూడా ఆక‌ట్టుకుంది.

ప్లస్ పాయింట్స్:

పవన్,రానా నటన

డైలాగ్స్

ఎమోషనల్ సీన్స్

యాక్షన్ సీన్స్

తమన్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

స్లో నేరేషన్

ఫస్టాఫ్‌ సాగదీత

రేటింగ్

3.5/5