Bhola Shankar | మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ అప్‌డేట్

-

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న అప్‌కమింగ్ ఫిల్మ్ భోళా శంకర్(Bhola Shankar). తమిళ చిత్రం వేదాళమ్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెహ‌ర్‌ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో మహానటి కీర్తిసురేశ్‌(Keerthy Suresh) నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ అప్‌డేట్ అందించాడు చిరంజీవి. భోళాశంకర్ డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు చిరు(Chiranjeevi). డబ్బింగ్ స్టూడియోలో ఉన్న స్టిల్స్ షేర్ చేస్తూ.. భోళాశంకర్ డబ్బింగ్ పూర్తయింది. సినిమా రూపుదిద్దుకున్న తీరు చూసి చాలా ఆనందంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్‌లో డేట్స్‌ను గుర్తుంచుకోండి. ఆగస్టు 11న థియేటర్లలో కలుద్దామని ట్వీట్ చేశాడు చిరు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. భోళా శంకర్(Bhola Shankar) చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్(Mahathi Swara Sagar) సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Read Also:
1. ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...