భీమ్లా నాయక్ సినిమాకు భారీ షాక్..పోలీసులకు ఫిర్యాదు..అసలు ఏం జరిగిందంటే!

0
112

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ భీమ్లానాయక్’. పవన్ కళ్యాన్ స్టామినాను మరోసారి నిరూపిస్తూ.. భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. మళయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రిమేక్ గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే భీమ్లానాయక్ పై ఏపీలో పొలిటికల్ హీట్ కూడా నడుస్తోంది. ఇటీవల కాలంలో ప్రతీ సినిమాలో ఏదో ఒక సన్నివేశం తమ మనోభావాాలను కించపరిచేలా ఉందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా చూస్తున్నాం. తాజాగా భీమ్లానాయక్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది.ఇదిలా ఉంటే భీమ్లానాయక్ సినిమాకు షాక్ తగిలింది. ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

తమ మనోభావాలను దెబ్బతీస్తుందని కుమ్మరి కులస్తులు ఆరోపిస్తున్నారు. ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం. పురుషోత్తం గుంటూర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే ‘కుమ్మరి చక్రాన్ని’ రానా కాలుతో తన్నే సన్నివేశం తమ మనోభావానలు కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేలా పురుషోత్తం డిమాండ్ చేశారు.