బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి మనసులో మాట చెప్పిన వరుణ్ తేజ్

బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి మనసులో మాట చెప్పిన వరుణ్ తేజ్

0
101

సంవత్సరానికి మినిమమ్ ఆరు సినిమాలు అయినా రిలీజ్ అయ్యేలా మెగా ఫ్యామిలీ ఫ్లాన్ చేస్తోంది.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ , బన్నీ, చరణ్ , నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, ఇక చిరు అల్లుడు కూడా ఈ వరుసలోకి వచ్చారు.. ఇలా చూసుకుంటే ఆరు నుంచి ఏడు సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి రానున్నాయి.

అయితే ఇప్పుడు మెగా హీరోలకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.. మరీ ముఖ్యగా వరుణ్ తేజ్ కు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయట, ఇక్కడ సినిమాలు వరుసగా ఉండటంతో అక్కడ డేట్స్ కుదరక ఆ సినిమాలు చేయడం లేదట.

అయితే హిందీ సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ మాత్రం తనలో ఉందని వరుణ్ స్పష్టంగా చెప్పాడు. అన్నీ కుదిరితే హిందీలో సినిమా చేయడం ఖాయమని ప్రకటించాడు. అయితే టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న వరుణ్ కి హిందీ మార్కెట్ లోకి కూడా వెళ్లాలి అని ఉంది .అదీ మంచి ఆలోచనే
టాలీవుడ్ నుంచి నాగార్జున ప్రభాస్ సినిమాలు వెళ్లాయి, అక్కడ ఫేమ్ సంపాదించుకున్నారు. ఇక నేరుగా కాకుండా మన సినిమాలు అక్కడ డబ్ మాత్రమే అవుతున్నాయి. అయితే షారూఖ్ అంటే తనకు ఇష్టం అని చెప్పాడు వరుణ్ .