స్ధానిక సంస్ధల ఎన్నికలకు లోకేష్ భారీ ప్లాన్

స్ధానిక సంస్ధల ఎన్నికలకు లోకేష్ భారీ ప్లాన్

0
36

ఇక ఏపీలో మరో పోరుకు సిద్దం అవ్వనున్నారు నేతలు, రాజకీయంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు అంటే ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే, ఈసారి రాజధాని అంశం కూడా ఈ ఎన్నికల్లో కచ్చితంగా కీ రోల్ అవ్వనుంది.

రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా పెట్టిన సమయంలో జగన్ అంగీకారం తెలిపారు, అప్పుడు అమరావతికి మద్దతు తెలిపి మాట తప్పం, మడమ తిప్పం అన్నవారు నేడు ఏమైపోయారని ప్రశ్నించారు.

ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతోనే ముందుకు వెళ్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అయితే ఇందులో వైసీపీ కూడా మూడురాజధానుల ఆవశ్యకత చెబుతూ అమరావతిని ఎందుకు కాదంటున్నారో చెప్పే ప్రయత్నం చేయనుంది.