బ్రేకింగ్ – ముంబైలో కొవిడ్ ఆస్పత్రి కోసం అజయ్ దేవ్గన్ భారీ విరాళం

బ్రేకింగ్ - ముంబైలో కొవిడ్ ఆస్పత్రి కోసం అజయ్ దేవ్గన్ భారీ విరాళం

0
91

దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి ..ఓ పక్క పేషెంట్లు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు, ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత వేదిస్తోంది, ఇక రోజుకి మూడు లక్షలకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయి, అయితే కరోనా సెకండ్ వేవ్ లో కేసులు విజృంభించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

 

 

ఇక చాలా ప్రాంతాలు లాక్ డౌన్ లో ఉంటే మరికొన్ని ప్రాంతాలు వీకెండ్ లాక్ డౌన్ కు వెళ్లాయి.. ఈ విపత్కర సమయంలో చాలా మంది సినిమా సెలబ్రెటీలు ఎంతో సాయం చేస్తున్నారు, తాజాగా

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ విరాళం ఇచ్చారు.

 

20 పడకల కొవిడ్ ఐసీయూ ఏర్పాటు కోసం అజయ్ దేవగన్, ఆయన మిత్రులు కోటి రూపాయల మేర సాయం చేశారు. శివాజీ పార్కు దగ్గర ఈ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు..

ఈ మొత్తాన్ని అజయ్ దేవగన్ ఆర్గనైజేషన్ ఎన్వై ఫౌండేషన్ ఇప్పటికే బీఎంసీ అధికారులకు సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి, ఆయన చేసిన సాయానికి అందరూ అభినందిస్తున్నారు.