బన్నీ , చరణ్ ల మధ్య దూరం పెరగడానికి కారణం ఇదే..!!

బన్నీ , చరణ్ ల మధ్య దూరం పెరగడానికి కారణం ఇదే..!!

0
40

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలు తమ టాలెంట్ ఉపయోగించుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్నారు. ఇక అల్లువారి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్…మొదటి సినిమా గంగోత్రి. ఈ సినిమా పెద్దగా పేరు తీసుకు రాకపోయినా..తర్వాత వచ్చిన దేశముదురు, బన్ని, ఆర్య లాంటి సినిమాలు వరుస విజయాన్ని అందుకున్నాయి. ఇక మెగా హీరోలు ఏ ఫంక్షన్లో అయినా తమ మెగా హీరోల విషయాల గురించి చర్చిస్తుంటారు. కానీ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాపై అందరూ స్పందించారు కానీ అల్లు అర్జున్ రియాక్ట్ కాకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు. అయితే ఈవార్తల్లో నిజం లేదని గతంలో అల్లు అర్జున్ కొట్టిపారేశాడు. అయినప్పటికీ ఈ వార్తలకు బ్రేక్ పడలేదు. తాజాగా అల్లు శిరీష్ ఈ విషయంపై స్పందించాడు.

‘ఏబీసీడీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. బన్నీ, రామ్ చరణ్ విబేధాల గురించి స్పందించాడు. బన్నీ, చరణ్ లు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు..సినిమా కెరీర్ గురించి కష్టపడి పైకి వచ్చారు. అలాంటి వారి మద్య అభిప్రాయ భేదాలు వచ్చాయని రూమర్లు వస్తున్నాయి.వారిద్దరు మాట్లాడుకోరని అనడంలో అర్ధం లేదని అన్నారు. కొందరు యూట్యూబ్ వ్యూస్ కోసం అలాంటి కథనాలు రాస్తున్నారని, అలాంటి వార్తలను అసలు నమ్మొద్దన్నారు. బన్ని, చెర్రి మంచి స్నెహితులు అని అన్నారు.